Dulquer Salmaan: దుల్కర్ నెక్స్ట్ తెలుగు సినిమా కోసం రంగంలోకి సుకుమార్.. కానీ
మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత దుల్కర్ నటించిన సినిమాలన్నీ వరుసగా తెలుగులోకి డబ్ అయ్యాయి. అలాగే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో నేరుగా ప్రేక్షకులను పలకరించాడు దుల్కర్. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి సినిమాలో శివాజీ గణేష్ గా నటించి మెప్పించాడు దుల్కర్ సల్మాన్. ఇక రీసెంట్ గా సీతారామం సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు ఈ స్టార్ హీరో. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో దుల్కర్ కోసం క్యూ కడుతున్నారు టాలీవుడ్ దర్శకుడు. ఇక దుల్కర్ కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే దుల్కర్ కోసం వేట మొదలు పెట్టిన వారిలో ఎక్కువగా సుకుమార్ శిష్యులే ఉన్నారని టాక్. క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి మంచి విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కుమారి 21ఎఫ్. ఉప్పెన లాంటి సినిమాలు తెరకెక్కించారు సుక్కు శిష్యులు. ఇప్పుడు దుల్కర్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నారట. అయితే తన శిష్యులలో ఒకరు దుల్కర్ సల్మాన్ కు సరిపోయే కథ గురించి చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ తో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దుల్కర్ చుప్ అనే సినిమాతోపాటు కోక్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుల సినిమా పై క్లారిటీ వస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.