Throwback Photo : ఈ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో టాప్ డైరెక్టర్ ఉన్నారు..ఆ ఇద్దరు ఎవరో కనిపెట్టండి చూద్దాం.!
త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. పైన కనిపిస్తున్న ఫోటో చూశారా..? వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో అది.
సోషల్ మీడియాలో చాలా వైరల్ ఫోటోలకు కొదవే లేదు. నిత్యం ఎదో ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫోటోలు..ఒకప్పటి నాటి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. వీటిలో త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. పైన కనిపిస్తున్న ఫోటో చూశారా..? వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో అది. ఆ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అలాగే ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నారు గుర్తుపట్టారా.. అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయారు ఆ ఇద్దరు. ఒకరేమో హీరోగా రాణిస్తున్నారు మరొకరు టాప్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టారా..?
వెంకటేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాగే ఆ నటించిన సినిమాలకు పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా మారారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరో అలాగే డైరెక్టర్ ఎవరంటే..
ఈ ఫొటోలో నవ్వుతు ఉన్న పిల్లడు హీరో రామ్ పోతినేని.. అలాగే రెండో సర్కిల్ లో ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.