Aparna Balamurali: అపర్ణ బాలమురళికి చేదు అనుభవం.. అందరు చూస్తుండగానే
ఈ సూపర్ హిట్ సినిమాతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అపర్ణా బాలమురళీ. కాగా ఈ నటికి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది.

‘సూరారై పోట్రు’.. సూర్య, అపర్ణా బాలమురళి నటించిన ఈ సినిమాను తెలుగులో ఆకాశం నీహద్దురా పేరుతో విడుదల చేశారు. ఈ సూపర్ హిట్ సినిమాతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అపర్ణా బాలమురళీ. కాగా ఈ నటికి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కళాశాలకు వెళ్లిన అపర్ణ పట్ల అక్కడ ఓ విద్యార్ధి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దానిని చూసిన పలువురు నెటిజన్లు ఆ యువకుడి ప్రవర్తనపై మండిపడుతున్నారు.
voice: అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘తన్కమ్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజ్‌పై కూర్చొని ఉండగా.. ఓ విద్యార్థి అక్కడికి చేరుకుని ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం ఆమె చేయి పట్టుకుని లాగి ఆమె భుజంపై చేయి వేయబోయాడు.
యువకుడి అనుచిత ప్రవర్తనకు కంగుతిన్న ఆమె.. అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విద్యార్థి తిరిగి స్టేజ్‌పైకి వచ్చి.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎదుటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాలి’’, చెయ్కాలనుకున్నదంతా చేసేసి..‘‘క్షమాపణలు చెప్పడం సరికాదంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








