Tollywood: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు..

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్‌ చేసింది, ఏపీ హైకోర్టు. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది.

Tollywood: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు..
Ap
Follow us

|

Updated on: Jun 29, 2022 | 7:08 AM

ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంపై కీలక కామెంట్స్‌ చేసింది, ఏపీ హైకోర్టు. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది. ఆన్‌లైన్‌ సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. జూలై 2లోగా ఎంవోయూ చేసుకోవాలని, ఎగ్జిబిటర్లకు సూచించింది, ఏపీ హైకోర్టు. ఈ ఇష్యూపై జూలై రెండో వారంలో తుది తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థకు సంబంధించిన యువర్‌ స్క్రీన్స్‌ అనే పోర్టల్‌ ద్వారా, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది. బ్లాక్‌ టికెట్ల విధానానికి స్వస్తి పలికి, తక్కువ ధరకే వినోదం అందించేందుకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అధికారులు.

దీని ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటుందని వివరించారు. ఇతర ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా బుక్‌ చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై ప్రేక్షకుడికి అదనంగా 20 నుంచి 25 రూపాయల వరకూ భారం పడుతోందని చెప్పారు. APSFTVTDCతో ఒప్పందం చేసుకునే థియేటర్లకు, టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా థియేటర్లు ఇతర ఆన్‌లైన్‌ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయనే అపోహలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టళ్లతో పాటు, ప్రభుత్వం తీసుకొచ్చిన యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్‌ చేసుకోవొచ్చని చెబుతున్నారు, అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు, బుక్‌మై షో ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి : 

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!