Anupama Parameswaran: అయ్యయ్యో.. అనుపమకు వచ్చిన చిక్కులు.. నా ఫోన్ నంబర్ కాదంటూ హీరోయిన్ గగ్గోలు..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. టాలెంటెడ్ హీరో నితిన్ కాంబోలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran).
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. టాలెంటెడ్ హీరో నితిన్ కాంబోలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran). మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత అనుపమకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడుకు స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. యంగ్ హీరోస్.. అప్‌కమింగ్ హీరోస్ సరసన నటిస్తూ తెగ పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ గురించి తెలిసిందే. లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోస్.. అప్డే్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక నిన్న ఓ సినిమాలోని స్టిల్స్.. తను గర్భంతో ఉన్న ఫోటోలను షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది ఈ అమ్మడు. దీంతో గర్భవతిగా అనుపమ అంటూ నెట్టింట్లో అనుపమ పేరు మారుమోగింది. కేవలం నెటిజన్స్ మాత్రమే.. కాదు.. సెలబ్రెటీలు సైతం అనుపమ ప్రెగ్నెంట్ ఫోటోస్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అలా సోషల్ మీడియాలో అనుపమ పేరు తెగ వైరల్ అవుతుంది.
తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది అనుపమ. ఓ ఫోన్ నంబర్ షేర్ చేస్తూ అది తనది కాదని.. ఆ నంబర్ నుంచి ఫోన్స్, మెసెజ్ వచ్చినా రిప్లై ఇవ్వద్దని తన అభిమానులను అలర్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల అనుపమ రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.
View this post on Instagram
Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..
Mahesh Babu: మహేష్ కూడా రిలీజ్ డేట్ ప్రకటించేశాడోచ్.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..
Tollywood: టాలీవుడ్‌లో జోష్ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్..
Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..