Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Mahesh Babu: ఏమంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారో కానీ టాలీవుడ్‌లో కొత్త సినిమాల విడుదల ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్లు..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2022 | 8:48 PM

Mahesh Babu: ఏమంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారో కానీ టాలీవుడ్‌లో కొత్త సినిమాల విడుదల ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆచార్య, ఎఫ్‌3, భీమ్లానాయక్‌ సినిమాల తేదీలను ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి మహేష్‌ బాబు కూడా వచ్చి చేరారు. మహేష్‌ హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారిపాట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇటీవల అటు మహేష్‌, ఇటు కీర్తి సురేశ్‌ ఇద్దరూ కరోనా బారిన పడడంతో షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇక త్వరగతిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేద్దామని చిత్ర యూనిట్‌ భావించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా కూడా విడుదల తేదీని వాయిదా వేసుకుంది. అయితే తాజాగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడడం, పలు చిత్రాలు విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో సర్కారు వారి పాట టీమ్‌ కూడా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సర్కారు వారి పాట చిత్రాన్ని మే12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఈ వార్త తెలిసిన మహేష్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్‌ ఇప్పటి వరకు మళ్లీ వెండితెరపై కనిపించలేదని చెప్పాలి. దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Also Read: Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Boat Airdopes 111: బోట్‌ నుంచి కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌.. రూ. 1500లోపు అదిరిపోయే ఫీచర్లు..

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడతా.. బౌలింగ్‌ కూడా చేస్తా: టీమిండియా ఆల్‌రౌండర్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే