Tollywood: టాలీవుడ్‌లో జోష్ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్..
Tollywood: కరోనా సెకండ్ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులు మళ్లీ ఎప్పటిలా మారాయి. దీంతో అన్ని రంగాలు గాడిన పడినట్లే సినిమా రంగం కూడా ట్రాక్ ఎక్కింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అఖం, పుష్ప, శ్యామ్‌సింగరాయ్ వంటి చిత్రాలతో..
Tollywood: కరోనా సెకండ్ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులు మళ్లీ ఎప్పటిలా మారాయి. దీంతో అన్ని రంగాలు గాడిన పడినట్లే సినిమా రంగం కూడా ట్రాక్ ఎక్కింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అఖం, పుష్ప, శ్యామ్‌సింగరాయ్ వంటి చిత్రాలతో పూర్వవైభవం వచ్చింది. ఇక థియేటర్లు ఓపెన్ అయ్యాయి, సంతోషంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడొచ్చని ఫ్యాన్స్ ఖుషీ అవుతోన్న సమయంలో థార్డ్ వేవ్ రూపంలో మరో బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా విపరీతంగా కేసులు పెరగడంతో అన్ని రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. దీంతో సినిమాలు వాయిదా వేసుకోలేక తప్పలేదు.
ఇలా వాయిదా పడ్డ బడా చిత్రాల్లో తొలి సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా వాయిదా పడి అందరినీ నిరాశకు గురి చేసింది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ టాలీవుడ్‌లో కొత్త జోష్ తీసుకొచ్చింది. జక్కన్న తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల్లో జోష్ నింపింది. నిజానికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ తాజాగా మార్చి 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీని ప్రకటించిందో లేదో ఇతర సినిమాలు కూడా తమ విడుదల తేదీని ప్రకటించాయి. తాజాగా రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన కొన్ని చిత్రాలు ఇవే..
* ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీని ప్రకటించిన వెంటనే సినిమా తేదీని ప్రకటించిన చిత్రం ఆచార్య. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
* పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్ మూవీ యూనిట్ కూడా విడుదల తేదీపై ప్రకటన చేసింది. ‘మేము తొలి నుంచి ప్రామిస్ చేస్తున్నట్లుగానే భీమ్లా నాయక్‌ను థియేటర్లలోనే విడుదల చేస్తాము. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఫిబ్రవరి 25న లేదా, ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేస్తాము’ అంటూ ఓ ప్రకటన చేశారు.
* ఇక తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించిన మరో చిత్రం ఎఫ్3. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఇప్పటికే పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ తాజాగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇలా ఒకేరోజు ఏకంగా నాలుగు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడంతో టాలీవుడ్‌లో జోష్ నిండినట్లైంది. అయితే రాధేశ్యామ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం గమనార్హం. ఈ సినిమా కూడా ఇదే సమయంలో విడుదల కావాల్సి ఉండగా, చిత్ర యూనిట్ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉంది.
Also Read: Viral News: జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేపలు.. ఎంత ధర పలికాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Health Benefits Of Moong Dal: పెసర పప్పు,, చికెన్‌తో సమానం..