AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal: యానిమల్ సినిమా నుంచి నయా పోస్టర్.. విలన్‌గా ఆ స్టార్ నటుడు

టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సందడి చేశాయి. కానీ బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఒక్క హీరో కూడా హిట్ అందుకోలేకపోయారు. అదే సమయంలో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. పఠాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసింది.

Animal: యానిమల్ సినిమా నుంచి నయా పోస్టర్.. విలన్‌గా ఆ స్టార్ నటుడు
Animal
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2023 | 9:56 AM

Share

మొన్నామధ్య వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన బాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత బాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లు పలకరించాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సందడి చేశాయి. కానీ బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఒక్క హీరో కూడా హిట్ అందుకోలేకపోయారు. అదే సమయంలో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. పఠాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసింది. ఆతర్వాత వచ్చిన దృశ్యం’, ‘బ్రహ్మాస్త్ర’, ఇటీవల వచ్చిన ‘గదర్‌ 2’ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే రీసెంట్ గా జవాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో బాలీవుడ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది.

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫాన్స్, ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు యానిమల్. స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యానిమల్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి మరొక పోస్టర్ ను రిలీజ్ చేశారు. యానిమల్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నాడు. ఆయన లుక్ సినిమా పై ఆసక్తిని పెంచింది. అనిల్ కపూర్  గాయపడి, ఎవరినో కోపంతో చూస్తూ కనిపించారు. ‘యానిమల్’ సినిమాలో అనిల్ కపూర్ విలన్ పాత్రలో  కనిపిస్తారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా గతంలో సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే సినిమా హిందీ రీమేక్ ‘కబీర్’కి దర్శకత్వం వహించాడు సందీప్ . ఇప్పుడు ‘యానిమల్‌’ తో రానున్నాడు. ‘యానిమల్‌’ సినిమా పోస్టర్‌లలో రణబీర్ కపూర్ తన చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలితో సిగరెట్ వెలిగిస్తున్నట్లు చూపించారు. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు. ఈ నెల 28న ‘యానిమల్’ సినిమా టీజర్‌ను విడుదల చేసి, డిసెంబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి బయటకి వచ్చిన రణబీర్ కపూర్ మాస్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ‘యానిమల్’ సినిమా అతడికి మాస్ ఇమేజ్ ను పెంచుతుందని అంటున్నారు అయన ఫ్యాన్స్. ‘యానిమల్’ తర్వాత రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర 2’లో నటించనున్నాడు. ఆ తర్వాత సౌత్ ఇండియన్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. అటు సందీప్ రెడ్డి ‘యానిమల్’ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్‌ కోసం కొత్త సినిమా చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం