Anasuya: ఛాలెంజింగ్ రోల్స్‌లో అదరగొడుతున్న అనసూయ.. ఈసారి సరికొత్తగా..
బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో అనసూయ (Anasuya) ఒకరు . అందం... వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనసూయ స్టైల్.
బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో అనసూయ (Anasuya) ఒకరు . అందం… వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనసూయ స్టైల్. జబర్థస్థ్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యింది అనసూయ. ఓవైపు టెలివిజన్‌పై యాంకర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతూనే .. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. సుకుమార్.. రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో వచ్చిన రంగస్థలం (Rangastalam) సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమాలో రంగమ్మత (Rangammatta) పాత్రలో అనసూయ నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకంటూ వెండితెరపై బిజీగా మారిపోయింది.
ఇక ఇటీవల అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప మూవీలో దాక్షయణిగా మెప్పించింది. ఈ సినిమాలో దాక్షయణి పాత్రలో మరోసారి సత్తా చాటింది అనసూయ. విభిన్న లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఈ యాంకరమ్మ. తాజాగా అనసూయ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి సినిమాలో అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం అనసూయ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతుందట. అందులో ఒకటి రెబల్‌గా..మరోకటి బ్రహ్మణ యువతిగా కనిపించనుందని టాక్. అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే మరో రోల సినిమా చివరి వరకు ఉండి ఆసక్తికరంగా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి నటిగా ఎప్పటికప్పుడు సరికొత్త ఛాలెంజింగ్ రోల్స్ ఎంపికచేసుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనసూయ.
Also Read: Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..
Thamannah: తమన్నా ఛాలెంజ్‌కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..