30 Weds 21 Season 2: ఆకట్టుకుంటున్న 30 వెడ్స్ 21 టీజర్.. ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధమయిన జంటపక్షులు..

యూట్యూబ్‏లో ఇప్పటివరకు హిట్ అయిన వెబ్ సిరీస్‏లలో 30 వెడ్స్ 21 (30 Weds 21) ఒకటి .

30 Weds 21 Season 2: ఆకట్టుకుంటున్న 30 వెడ్స్ 21 టీజర్..  ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధమయిన జంటపక్షులు..
30 Weds 21
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2022 | 7:47 AM

యూట్యూబ్‏లో ఇప్పటివరకు హిట్ అయిన వెబ్ సిరీస్‏లలో 30 వెడ్స్ 21 (30 Weds 21) ఒకటి . 2021 ఏడాదిలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ఇది. 30 ఏళ్ల వ్యక్తికి 21 ఏళ్ల అమ్మాయితో వివాహం జరగడం అనే కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ఆకట్టుకుంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న జంట మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూపించారు మేకర్స్. ఇందులో హీరోగా చైతన్య, హీరోయిన్‏గా అనన్య నటించి మెప్పించారు. ఈ సిరీస్ అతి తక్కువ సమయంలోనే మంచి టాక్ సంపాదించుకుని సూపర్ హిట్ అయ్యింది. అయితే ఎంతో హిట్ అయిన ఈ సిరీస్‏కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ తెరకెక్కిస్తున్నారు. నిన్న విడుదలైన 30 వెడ్స్ 21 సెకండ్ సీజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరీస్ సెకండ్ సీజన్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక మనిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్‏తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో చైతన్య, అనన్య.. ఇద్దరూ అనేక భావోద్యేగాల మధ్య కలిసిన ప్రేమ పక్షుల్లా విహరించడం, అనుభూతి చెందడం ఈ టీజర్‏లో చూపించారు. నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి.. మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది.. అంటూ సాగే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. దీనికి మనోజ్ పీ కథ అందించగా.. పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. జోస్ జిమ్మీ సంగీతం అందించారు.

Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే