AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం తెగ వైరల్ అవుతుంటుంది. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్

Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..
Suman
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2022 | 8:50 AM

Share

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం తెగ వైరల్ అవుతుంటుంది. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో పలువురు నటీనటులు తమపై వస్తున్న పుకార్లను ఖండించగా.. మరికొందరు అస్సలు పట్టించుకోరు. ఇప్పటికే ఈ సమస్యను చాలా మంది హీరోహీరోయిన్స్ ఎదుర్కోన్నారు. తాజాగా మరో సీనియర్ హీరో సుమన్ (Suman) సైతం ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

గత కొద్ది రోజులుగా నెట్టింట్లో సుమన్ గురించి పలు వార్తలు పుట్టుకొచ్చాయి. భారత సైన్యానికి ఈ హీరో ఏకంగా 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భూమిని నటుడు సుమన్ భారత సైన్యానికి విరాళం ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై హీరో సుమన్ స్పందించాడు. తాను 117 ఎకరాల భూమిని భారత సైన్యానికి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. వాటిని ఎవరు నమ్మకండి. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులోనే ఉంది. వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తిగతంగా నేనే వివరాలు మీడియా ద్వారా తెలియజేస్తాను. ఆ భూమికి సంబంధించిన ఏ విషయమైన నేనే చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు సుమన్.

Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..