‘లోకల్ గ్యాంగ్స్’ ప్రొమో : గత్తరలేపిన అనసూయ

స్టార్ యాంకర్ అనసూయ రోజురోజుకూ మరింత గ్లామరస్‌గా తయారవుతోంది. అమ్మడి స్క్రీన్ ప్రెజన్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇప్పటికే యూత్‌లో ఊహించని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనూ..ఈ మధ్య ఆ బజ్‌ను మరింత రెట్టింపు చేసుకుంది. ఒకవైపు షోస్, మరోవైపు సినిమాలతో దుమ్మురేపుతోంది. కాగా ఇటీవల  ‘లోకల్ గ్యాంగ్స్’  షోతో.. జీ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ యాంకర్. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోస్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. స్ఫెషల్‌గా […]

'లోకల్ గ్యాంగ్స్' ప్రొమో : గత్తరలేపిన అనసూయ
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 2:06 PM

స్టార్ యాంకర్ అనసూయ రోజురోజుకూ మరింత గ్లామరస్‌గా తయారవుతోంది. అమ్మడి స్క్రీన్ ప్రెజన్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఇప్పటికే యూత్‌లో ఊహించని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనూ..ఈ మధ్య ఆ బజ్‌ను మరింత రెట్టింపు చేసుకుంది. ఒకవైపు షోస్, మరోవైపు సినిమాలతో దుమ్మురేపుతోంది.

కాగా ఇటీవల  ‘లోకల్ గ్యాంగ్స్’  షోతో.. జీ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ యాంకర్. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోస్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. స్ఫెషల్‌గా చెప్పాలంటే అనసూయ తన గ్రాండ్ ఎంట్రీతో మతిపోగొట్టేసింది. తన గ్లామర్‌తో ఎపిసోడ్‌పై స్పెషల్ అటెన్షన్ గ్రాబ్ చేసింది. కో జడ్జ్ జానీ మాస్టర్‌తో కలిసి ‘చిట్టినడుమునే చూస్తున్నా….’ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అంతేనా..గెస్ట్‌గా వచ్చిన హీరో కార్తీకేయ కూడా అనసూయ అందానికి బాధితుడిలానే కనిపించాడు. ఆమె డ్యాన్స్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది వండర్‌పుల్ అవుతుందంటూ..బిస్కెట్స్ వేశాడు. ఫైనల్‌గా ఇద్దరూ కలిసి రెండు స్టెప్పులు వేశారు.  ఏది ఏమైనా అనసూయ తన అందంతో   ‘లోకల్ గ్యాంగ్స్’  రేటింగ్స్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లడం గ్యారంటీగా కనిపిస్తోంది.