‘లస్ట్ స్టోరీస్’ : నాగ్ అశ్విన్‌ లాక్ అయ్యాడా..?

‘లస్ట్ స్టోరీస్’…లెక్కకు మించిన ఫ్యాన్స్. అవును, బోల్డ్ కంటెంట్‌తో వచ్చి..ఊహించని హిట్ అయ్యింది ఈ సిరీస్. రాధికా ఆప్టే, కియారా అద్వానీ లాంటి భామలు రెచ్చిపోయి యాక్ట్ చేశారు. యూత్‌కు ‘లస్ట్ స్టోరీస్’పై.. లవ్ క్రియేట్ చేశారు.  అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్..సీజన్స్ వారీగా దీన్ని డైరెక్ట్ చేశారు. ఇక పోతే త్వరలోనే ఈ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హిందీ మాదిరిగానే తెలుగులో కూడా నలుగురు దర్శకులు దీన్ని డీల్ […]

'లస్ట్ స్టోరీస్' : నాగ్ అశ్విన్‌ లాక్ అయ్యాడా..?
Ram Naramaneni

| Edited By: Srinu Perla

Dec 09, 2019 | 2:03 PM

‘లస్ట్ స్టోరీస్’…లెక్కకు మించిన ఫ్యాన్స్. అవును, బోల్డ్ కంటెంట్‌తో వచ్చి..ఊహించని హిట్ అయ్యింది ఈ సిరీస్. రాధికా ఆప్టే, కియారా అద్వానీ లాంటి భామలు రెచ్చిపోయి యాక్ట్ చేశారు. యూత్‌కు ‘లస్ట్ స్టోరీస్’పై.. లవ్ క్రియేట్ చేశారు.  అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్..సీజన్స్ వారీగా దీన్ని డైరెక్ట్ చేశారు. ఇక పోతే త్వరలోనే ఈ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హిందీ మాదిరిగానే తెలుగులో కూడా నలుగురు దర్శకులు దీన్ని డీల్ చేయబోతున్నారు.

సందీప్ రెడ్డి వంగా,  తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి..లాంటి క్రేజీ డైరెక్టర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సెలెక్ట్ చేసుకుంది. అయితే స్క్రిప్ట్ విషయంలో విభేదాల వల్ల సందీప్ వంగా ప్రాజెక్ట్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దీంతో నూతన దర్శకుడి కోసం అన్వేషణ సాగించింది నిర్మాణ సంస్థ. ఫైనల్‌గా సెన్సిబుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను కన్ఫామ్ చేశారని టాక్. ఇందుకు సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్ పూర్తయినట్టు తెలుస్తోంది.

ఈ న్యూస్ బయటకు రాగానే అశ్విన్‌ను ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు నెటిజన్లు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి లాంటి అర్ధవంతమైన చిత్రాలను తీసిన వ్యక్తి , పక్కా రొమాంటిక్ అండ్ బోల్డ్ కంటెంట్‌ని ఎలా డైరెక్ట్ చేస్తాడంటూ పెదవి విరుస్తున్నారు. కాకపోతే క్రియేటివిటీ విషయంలో హద్దులు ఉండవనేది మరికొంతమంది చెప్తోన్న మాట. మరి నాగ్ అశ్విన్ ఈ కంటెంట్ తన స్టైల్లో ఎలా తెరకెక్కిస్తారో..లేదా ఒరిజినల్ ప్లేవర్‌ను సేమ్ దింపేస్తారో..? లెట్స్ వెయిట్ అండ్ సీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu