‘అల వైకుంఠపురం’ : డిజిటల్, శాటిలైట్ రైట్స్‌లో దుమ్మురేపుతోన్న బన్నీ..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అల వైకుంఠపురం’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ‘అల వైకుంఠపురం’ బన్నీకి 19వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నవదీప్, జయరాం, నివేదా పేతురాజ్, టబు, సుశాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ అందించిన బాణీలు ప్రేక్షకులను ఇప్పటికే మెస్మరైజ్ చేస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.వచ్చే […]
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అల వైకుంఠపురం’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ‘అల వైకుంఠపురం’ బన్నీకి 19వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నవదీప్, జయరాం, నివేదా పేతురాజ్, టబు, సుశాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ అందించిన బాణీలు ప్రేక్షకులను ఇప్పటికే మెస్మరైజ్ చేస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది.
గత రెండు సినిమాలు ప్లాపవ్వడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని బన్నీ కసిగా ఉన్నాడు. కాగా మూవీకి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. సన్ నెట్ వర్క్ సంస్థ భారీ ధరలకు డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. మొదట నెట్‌ప్లిక్స్‌కు అమ్మినట్టు వార్తలొచ్చినా, సన్ నుంచి భారీ అమౌంట్ ఆఫర్ రావడంతో మూవీ టీం అటువైపు మొగ్గు చూపిందట. దీనికి సంబంధించి డీల్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. కాగా వీటిపై మూవీ టీం నుంచి అఫిషియల్ ఇన్పర్మేషన్ రావాల్సి ఉంది.