సమంతా.. ఏమైందమ్మా నీకు..!

“సమంతా.. ఏమైందమ్మా నీకు” ఇప్పుడు ఇదే ప్రశ్నను చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమంత అక్కడ కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. కాస్త బక్క చిక్కి.. మొహంలో అంత కళ లేకుండా కనిపించింది. దీనిపై కొందరు అభిమానులు సూపర్ అని కామెంట్ పెట్టినా.. మరికొందరేమో ఇక్కడ మన సమంతానా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సినిమాలను చేయడంలో సమంత కాస్త స్లో అయిపోయింది. శర్వానంద్ […]

సమంతా.. ఏమైందమ్మా నీకు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 2:28 PM

“సమంతా.. ఏమైందమ్మా నీకు” ఇప్పుడు ఇదే ప్రశ్నను చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమంత అక్కడ కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. కాస్త బక్క చిక్కి.. మొహంలో అంత కళ లేకుండా కనిపించింది. దీనిపై కొందరు అభిమానులు సూపర్ అని కామెంట్ పెట్టినా.. మరికొందరేమో ఇక్కడ మన సమంతానా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా సినిమాలను చేయడంలో సమంత కాస్త స్లో అయిపోయింది. శర్వానంద్ సరసన ఆమె నటించిన 96 రీమేక్ షూటింగ్ పూర్తి కాగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మనోజ్ బాజ్‌పేయి నటిస్తోన్న ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో కీలక పాత్రలో ఆమె నటిస్తోంది. ఇది కాకుండా నాగ చైతన్య సరసన మరో చిత్రంలో నటించేందుకు సమంత ఓకే చెప్పినట్లు ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తున్నా.. వాటిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక నిర్మాతగానూ ఆమె అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తమ అభిమాన హీరోయిన్ సినిమాలను తగ్గించడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉంటే 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించడం కోసమే.. గ్యాప్ తీసుకున్నట్లు సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.