తమ్ముడికి కొండంత అండ..ఎలాగంటే..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ టైంలోనే టాప్ స్థానానికి దూసుకుపోయాడు ఈ రౌడీ హీరో. తనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఇతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే పూరితో ‘ఫైటర్’ చేయనున్నాడు. ఇవి పక్కనబెడితే ఈ యంగ్ హీరో […]
యంగ్ హీరో విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ టైంలోనే టాప్ స్థానానికి దూసుకుపోయాడు ఈ రౌడీ హీరో. తనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఇతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంటనే పూరితో ‘ఫైటర్’ చేయనున్నాడు.
ఇవి పక్కనబెడితే ఈ యంగ్ హీరో గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. విజయ్ తమ్ముడ ఆనంద్ దేవరకొండ ఇటీవల ‘దొరసాని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది పెద్దగా ఆడలేదు. విజయ్ కూడా తన తమ్మడుకి పెద్దగా సపోర్ట్ చెయ్యలేదు. అదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పి ఎమోషనల్ అయ్యాడు కూడా. ఇంక ఎలాగూ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి అతడి కెరీర్‌ను కూడా గాడిలో పెట్టాలని విజయ్ భావిస్తున్నాడట. అందుకే త్వరలో ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి స్క్రిప్ట్ సిద్దమైందా..? లేక ఇంకా సెర్చింగ్‌లోనే ఉన్నారా అనే అంశం తేలాల్సి ఉంది.