టాలీవుడ్ నిర్మాత బర్త్‌డే ఫంక్షన్‌లో.. తప్ప తాగి రచ్చ చేసిన ప్రముఖ యాంకర్!

అందం, అభినయంతో బుల్లితెరలోనే కాదు.. వెండితెరపై కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ నటి.. అప్పుడప్పుడు సినిమాల్లో తళుక్కుమంటూ మెరుస్తోంది.  లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ప్రముఖ యాంకర్.. రీసెంట్‌గా జరిగిన ఓ టాలీవుడ్ నిర్మాత పుట్టినరోజు ఫంక్షన్‌లో తప్ప తాగి తెగ హడావుడి చేసిందట. దొరికిన వాళ్లందరికి సెల్ఫీలు ఇస్తూ రచ్చ రచ్చ చేసిందని సమాచారం. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ‘కల్కి’, ‘జై సింహ’, ‘ఆర్‌డిఎక్స్ 100’ […]

టాలీవుడ్ నిర్మాత బర్త్‌డే ఫంక్షన్‌లో.. తప్ప తాగి రచ్చ చేసిన ప్రముఖ యాంకర్!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 10, 2019 | 1:13 PM

అందం, అభినయంతో బుల్లితెరలోనే కాదు.. వెండితెరపై కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ నటి.. అప్పుడప్పుడు సినిమాల్లో తళుక్కుమంటూ మెరుస్తోంది.  లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ ప్రముఖ యాంకర్.. రీసెంట్‌గా జరిగిన ఓ టాలీవుడ్ నిర్మాత పుట్టినరోజు ఫంక్షన్‌లో తప్ప తాగి తెగ హడావుడి చేసిందట. దొరికిన వాళ్లందరికి సెల్ఫీలు ఇస్తూ రచ్చ రచ్చ చేసిందని సమాచారం. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

‘కల్కి’, ‘జై సింహ’, ‘ఆర్‌డిఎక్స్ 100’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుక రీసెంట్‌గా హోటల్ తాజ్‌కృష్ణాలో జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులందరూ విచ్చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ వేడుకకు రావడం విశేషం. ఇలాంటి ఎందరో మహామహులు విచ్చేసిన ఫంక్షన్‌లో బుల్లితెర ప్రముఖ యాంకర్ తప్ప తాగి.. తూలుతూ హడావుడి చేసిందట. అంతటితో ఆగకుండా దొరికిన వాళ్లందరికీ సెల్ఫీలు ఇస్తూ రచ్చ రచ్చ చేసిందని తెలుస్తోంది. వీకెండ్స్‌లో గానీ, పార్టీల్లో గానీ సెలబ్రిటీలు మద్యం సేవించడం సహజం. కానీ అది కాస్తా ఓవర్ డోస్ అయితే మాత్రం.. పరిస్థితులు తారుమారవుతాయని గుర్తుంచుకోవాలి.