భారత పౌరసత్వ వివాదం..షాపై అమెరికా ఆంక్షలు
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై యూఎస్ కమిషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే హోం మంత్రి అమిత్‌షా సహా కీలక నేతలపై ఆంక్షలు విధించే విషయాన్ని యోచించాలని ట్రంప్ సర్కార్‌ను కోరింది. వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే బిల్లులో ముస్లింలను మినహాయించడం తప్పుడు మార్గంలో వెళ్తున్న ప్రమాదకరచర్యగా అభివర్ణించింది. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత […]
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై యూఎస్ కమిషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్ సీఐఆర్ ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే హోం మంత్రి అమిత్‌షా సహా కీలక నేతలపై ఆంక్షలు విధించే విషయాన్ని యోచించాలని ట్రంప్ సర్కార్‌ను కోరింది. వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే బిల్లులో ముస్లింలను మినహాయించడం తప్పుడు మార్గంలో వెళ్తున్న ప్రమాదకరచర్యగా అభివర్ణించింది.
పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది యూఎస్ సీఐఆర్ ఎఫ్. లౌకిక దేశంగా ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో.. మత ప్రతిపాదికన విభజన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అందరికీ సమాన హక్కులు కల్పించేలా రూపొందించిన భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది. ఐతే హోం మంత్రి అమిత్‌షా మాత్రం పౌరసత్వ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇక యూఎస్సీఐఆర్ఎఫ్ ప్రతిపాదనలను అమెరికా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా అంటే తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదు. కానీ అవసరమైన సందర్భాల్లో మాత్ర ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఉంటుంది. మరోవైపు ఫెడరల్ కమిషన్ గతంలో ఎన్నో నివేదికలు ఇచ్చినా..మత స్వేచ్ఛను పరిశీలించేందుకు భారత్‌కు వస్తామని చెప్పినా భారత్ ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు.