AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

370 రద్దుపై సుప్రీం విచారణ ప్రారంభం

అయిదు నెలల క్రితం ఎత్తేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దులో న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డే నియమించారు. ఈ బెంచ్ మంగళవారం నుంచి ప్రభుత్వ నిర్ణయంలో లీగాలిటీని పరిశీలించనున్నది. ఆగస్టు 5వ తేదీ ఏ భారతీయుడు మరచిపోలేని రోజు. దశాబ్దాలుగా కశ్మీర్ డిస్ట్రబెన్స్‌కు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన రోజది. ఆరోజు రాజ్యసభలో […]

370 రద్దుపై సుప్రీం విచారణ ప్రారంభం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Dec 10, 2019 | 12:44 PM

Share

అయిదు నెలల క్రితం ఎత్తేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దులో న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డే నియమించారు. ఈ బెంచ్ మంగళవారం నుంచి ప్రభుత్వ నిర్ణయంలో లీగాలిటీని పరిశీలించనున్నది.

ఆగస్టు 5వ తేదీ ఏ భారతీయుడు మరచిపోలేని రోజు. దశాబ్దాలుగా కశ్మీర్ డిస్ట్రబెన్స్‌కు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన రోజది. ఆరోజు రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన ప్రసంగాన్ని ఏ భారతీయుడు మరచిపోలేడు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ వివాదానికి శాశ్వతంగా తెరదించినట్లయిందని కేంద్రం చెప్పుకుంది.

అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుమారు 32 వరకు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు సిజెఐ అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్.ఏ.కౌల్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు న్యాయబద్దంగా, చట్టబద్దంగా వుందనే అంశాన్ని ఈ సుప్రీం ధర్మాసనం విచారించనున్నది.

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?