Chimney Collapsed: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ చిమ్నీ.. 30 మంది సజీవ సమాధి..!
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ముంగేలి జిల్లాలోని బిలాస్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాంబోడ్ గ్రామంలో కుసుమ్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం చిమ్నీ కింద దాదాపు 30 మంది కార్మికులు సమాధి అయ్యినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది సజీవ సమాధి అయ్యారు. ముంగేలి జిల్లాలో గురువారం(జనవరి 9) సాయంత్రం బాల్కో థర్మల్ పవర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలింది. సర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబోడ్ ప్రాంతంలోని కుసుమ్ ప్లాంట్‌లో చిమ్నీ కూలిపోవడంతో 30 మంది సమాధి అయ్యారు. వీరిలో 9 మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే చిమ్నీలోని శిథిలాల నుంచి ఇద్దరు వ్యక్తులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారుల బృందం సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ముంగేలి జిల్లాలోని బిలాస్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాంబోడ్ గ్రామంలోని కుసుమ్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్లాంట్‌లో ఉంచిన వస్తువుల నిల్వ ట్యాంక్ ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అందులో చిక్కుకున్నారు. దాని శిథిలాల కింద 30 మంది కూలీలు సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్‌లో CEFCO కంపెనీ ఏర్పాటు చేస్తున్న చిమ్నీ కుప్పకూలింది. ఈ సమయంలో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ అశోక్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సర్గావ్ పోలీస్ స్టేషన్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఘటన తీవ్రతను గమనించిన జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక దళం, రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ఇద్దరిని బయటకు తీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..