AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే.. ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అమితాబ్‌, అక్షయ్‌.. ఎందుకు కలిశారో తెలుసా?

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకే సినిమాలో నటిస్తున్నారా ?...

Suriya: ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే.. ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అమితాబ్‌, అక్షయ్‌.. ఎందుకు కలిశారో తెలుసా?
Amitabh, Akshay Kumar, Suriya
Basha Shek
|

Updated on: Jan 15, 2024 | 11:18 AM

Share

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకే సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే అసలు విషయం అది కాదు. అమితాబ్ బచ్చన్, సూర్య, అక్షయ్ కుమార్ కలిసి ఒక ప్రకటన కోసం ఇలా ఏకమయ్యారు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’ త్వరలో ప్రారంభం కానుంది. సెలబ్రిటీలు గేమ్ ఆడే జట్ల యాజమాన్యాన్ని తీసుకున్నారు. అందుకే, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సూర్య వంటి నటీనటులు ఈ లీగ్‌ ప్రకటనలో పాల్గొన్నారు. దీని ప్రకటన షూటింగ్ కోసం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా వచ్చారు. అయితే గ్రూప్ ఫోటో తీయకముందే హృతిక్ రోషన్ వేరే పని మీద బయటకు వెళ్లిపోయాడు.

అక్షయ్ కుమార్, సూర్యతో కలిసి ఫొటో దిగిన అమితాబ్ బచ్చన్‌ దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ‘హృతిక్ రోషన్ త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసి వెళ్లిపోయాడు. మా షూటింగ్‌కి రెడీ అయ్యాను. సౌతిండియా నటుడు సూర్యను కలవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ కూడా సూర్య సినిమాలు, పాటలను ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ చేతికి గాయమైంది. చేతికి కట్టు కట్టుకుని ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌’ అడ్వర్టైజ్‌మెంట్‌ షూటింగ్‌ కోసం బ్యాండేజ్‌ వేసుకున్నాడు. తన చేతికి ఏమయిందో అక్షయ్ కుమార్ కు వివరించాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను తన బ్లాగ్‌లో షేర్‌ చేశాడు. 81 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ ఎంతో చురుగ్గా ఉంటున్నాడు. వరుసగా సినిమాలు, యాడ్స్‌లోనూ నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

 సూర్య నటించిన పాపులర్ చిత్రం సూరరై పొట్రు (తెలుగులో ఆకాశమే హద్దురా) సినిమాను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రాధికా మదన్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, మేకర్స్ ఆలస్యానికి గల కారణాలను చెప్పకుండా సినిమాను వాయిదా వేశారు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు సూరరై పొట్రు ఒరిజినల్ మేకర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, ఆయన భార్య జ్యోతిక హోమ్‌ బ్యానర్‌ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..