Allu Sneha Reddy: సిల్వర్ కలర్ శారీలో స్టైలిష్‌గా మెరిసిపోయిన బన్నీ సతీమణి.. ఇంతకీ చీర ధరెంతో తెలుసా?
తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది స్నేహ. ఇందులో సిల్వర్ కలర్ శారీ ధరించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిందీ అందాల తార. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

టాలీవుడ్‌లో ది మోస్ట్ స్టైలిష్ అండ్ రొమాంటిక్ కపుల్ అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు అల్లు అర్జున్- స్నేహారెడ్డి. ముఖ్యంగా స్టైలిష్ యాటిట్యూడ్‌తో, సినిమా సినిమాకు లుక్ మార్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు బన్నీ. ఇక అల్లు అర్జున్ అడుగుజాడల్లోనే నడుస్తోంది ఆయన సతీమణి స్నేహ. సోషల్ మీడియాలో ఈమెకు హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ ఉంది. నెట్టింట్లో ఆమె షేర్ చేసే గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్త్ఉంటుంది. అలా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది స్నేహ. ఇందులో సిల్వర్ కలర్ శారీ ధరించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిందీ అందాల తార. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
కాగా ఈ అందమైన చీరను రిమ్‌జిమ్ దాదు డిజైన్ చేశారు. ఇక ప్రీతమ్ జుకల్కర్ తనను మరింత స్టైలిష్‌గా ముస్తాబు చేశాడని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది స్నేహ. కాగా ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘ బ్యూటిఫుల్.. సూపర్ .. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదు’ అంటూ బన్నీ భార్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫొటోషూట్‌లో స్నేహ ధరించిన చీర ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 1.76 లక్షల రూపాయలట. చూడడానికి ఇంత సింపుల్‌గా ఉన్న ఈ శారీ అంత ధరేంటని నెటిజన్లు షాకవుతున్నారు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
