Allu Arjun-Pushpa 2: షూటింగ్ పూర్తికాలేదు..అప్పుడే రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప 2.. ఇంతకీ అసలు విషమేంటంటే ?..
2021 డిసెంబర్‌లో విడుదలైన 'పుష్ప' సినిమా బన్నీ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈమూవీలో ఊర మాస్ లుక్ లో బన్నీ స్టైల్..డైలాగ్స్.. యాక్టింగ్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. 2021 డిసెంబర్‌లో విడుదలైన ‘పుష్ప’ సినిమా బన్నీ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పుష్ప 2 షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా పోస్టర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 మిలియన్ల (70 లక్షలు) లైక్స్ వచ్చాయి. భారతీయ సినిమాలో మరే సినిమా పోస్టర్‌కు ఇన్ని లైక్స్ రాలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు మేకర్స్. ఇక దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి యాక్షన్ కట్‌ని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌కి 70 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ లెక్కన అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాపై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న ‘పుష్ప 2’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్..
Icon Star @alluarjun‘s NATIONWIDE RULE 🔥🔥#Pushpa2TheRule First Look creates a sensational record ❤🔥❤️🔥
Becomes the first-ever Indian first look poster to hit 7 MILLION LIKES on Instagram 💥💥@iamRashmika @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @PushpaMovie… pic.twitter.com/CmJYrP58Xi
— Mythri Movie Makers (@MythriOfficial) August 12, 2023
ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ గెటప్ ప్రత్యేకం. ఎవ్వరు ఊహించని స్థాయిలో బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమా ఏ రెంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు డైరెక్టర్ సుకుమార్. ఇక బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాదిరిగానే కొందరు ఆ పోస్టర్‌లా వేషధారణలు వేసుకుని పోజిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు.
అల్లు అర్జున్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
అంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా వైరల్‌గా మారింది. ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ కావడంతో దాని సీక్వెల్‌పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తీయాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అల్లు అర్జున్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.