Actress Sridevi: అతిలోక సుందరికి అరుదైన గౌవరం.. గూగుల్ డూడుల్‏లో శ్రీదేవి అందమైన రూపం..

ఇప్పటికీ చిత్రపరిశ్రమలో ఆమె మరణం తీరని లోటు. ఈరోజు దివంగత నటి శ్రీదేవి పుట్టినరోజు (జయంతి). ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు.. బంధువులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన తారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీదేవితో తమకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు.

Actress Sridevi: అతిలోక సుందరికి అరుదైన గౌవరం.. గూగుల్ డూడుల్‏లో శ్రీదేవి అందమైన రూపం..
Actress Sridevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2023 | 4:03 PM

అతిలొక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పటికీ చిత్రపరిశ్రమలో ఆమె మరణం తీరని లోటు. ఈరోజు దివంగత నటి శ్రీదేవి పుట్టినరోజు (జయంతి). ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు.. బంధువులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన తారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీదేవితో తమకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆమె భర్త బోణీ కపూర్, కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ తమ తల్లి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ కూడా శ్రీదేవికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయాంగర్ అయ్యప్పన్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలు గడుస్తున్నాయి.. భౌతికంగా లేకపోయినా సినిమాల ద్వారా చిరస్థాయిగా జీవిస్తున్నారు. భారతీయ సినిమాకి ఆమె అందించిన సహకారం అపారమైనది. సినిమా రంగంలోకి వస్తున్న ఎందరో కొత్త నటీమణులకు ఇప్పటికీ శ్రీదేవి రోల్ మోడల్. తన గ్లామర్, నటనతో అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు స్టార్ హీరోలతో నటించింది.

శ్రీదేవి జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ నివాళి..

Sridevi

Sridevi

జాన్వీ కపూర్ ఇన్ స్టా పోస్ట్…

సరిగ్గా 4 దశాబ్దాల పాటు రంగుల ప్రపంచంలో తన ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు.పెళ్ల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. 2013లో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో మరోసారి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన చివరి చిత్రం ‘మామ్‌’.

బోణి కపూర్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Boney.kapoor (@boney.kapoor)

ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టనుంది. శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా వీరంతా పాత ఫొటోలను షేర్ చేశారు. శ్రీదేవి సినిమాలను మళ్లీ వీక్షిస్తూ అభిమానులు తమ అభిమాన నటికి నివాళులర్పిస్తున్నారు.

ఖుషి కపూర్ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.