AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…

ఏపీలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా అవేమీ పట్టనట్టే బరి తెగిస్తున్నారు. కొత్తకొత్త ఐడియాలతో గంజాయి స్మగ్లింగ్‌కు ప్రయత్నాలు సాగిస్తుండడం కలకలం రేపుతోంది. అయితే.. గంజాయి అక్రమ రవాణాపై డేగ కన్నేస్తున్న ఏపీ పోలీసులు.. స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ల గుట్టురట్టు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు.

Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం...
Door Mats
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2026 | 9:25 PM

Share

మొన్నామధ్య అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్‌ను చేధించారు. ఓ ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా.. ఉల్లిపాయల బస్తాల కింద గంజాయి ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. సుమారు 179 కేజీల గంజాయి పట్టుబడింది.

ఇప్పుడు అన్నమయ్య జిల్లా స్మగ్లర్ల రేంజ్‌ను మించిపోయేలా.. విశాఖలో కాస్త డిఫరెంట్‌గా గంజాయి స్మగ్లింగ్‌కు తెర లేపారు కొందరు కంత్రీగాళ్లు. ఇళ్లలో దర్వాజాల దగ్గర వేసుకునే మ్యాట్‌ల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అల్లూరి జిల్లా వంజంగి గ్రామానికి వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌లోని లగేజ్‌ స్కానర్‌లో మ్యాట్‌ మధ్యలో గంజాయి బ్యాగులను చూసి రైల్వే పోలీసులు షాకయ్యారు. మూడు మ్యాట్ బండిల్స్‌ను ముగ్గురు కూలీలతో రైల్వేస్టేషన్‌లోకి తెస్తుండగా పట్టుకున్నారు. మ్యాట్‌ల ముసుగులో తరలిస్తున్న సుమారు 60కేజీల గంజాయిని సీజ్‌ చేశారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి.. ముంబయికి తరలిస్తున్నట్లు గుర్తించారు.

మరోవైపు  అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలంలో గంజాయి బ్యాచ్‌ను పట్టుకున్నారు విశాఖ పోలీసులు. మత్స్యపురం దగ్గర పోలీసుల తనిఖీల్లో కోటి విలువైన గంజాయి పట్టుబడింది. బొలోరా వాహనంలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
లావణ్య రిజెక్ట్ చేసిన కథతో రష్మిక మందన్నా సినిమా.. కట్ చేస్తే..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు..
సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్..
సీనియర్ ఎన్టీఆర్‌కే షాకిచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్..
అవును.. డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేశా.. హీరోయిన్..
అవును.. డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేశా.. హీరోయిన్..