హిట్ కాంబినేషన్స్.. టాలీవుడ్‌లో రిపీట్ మోడ్ రన్ అవుతూనే ఉందిగా!
టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. విజయవంతమైన జంటలు తిరిగి తెరపైకి రావడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ దేవరకొండ-రష్మిక మందన, అల్లు అర్జున్-రష్మిక మందన, సుహాస్-శివాని నాగరం వంటి పలు హిట్ పెయిర్స్ కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
టాలీవుడ్‌లో హిట్ పెయిర్స్ మళ్ళీ మళ్ళీ కలిసి నటిస్తూ ప్రేక్షకులను అలరించే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక సినిమా విజయం సాధించిన వెంటనే, ఆ జంటను మరోసారి తెరపైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, అనేక హిట్ కాంబినేషన్లు తిరిగి వస్తున్నాయి. కలర్ ఫోటో విజయానికి కారణమైన హర్ష రోషన్, శ్రీదేవిల కెమిస్ట్రీని బ్యాండ్ మేళం చిత్రంలో కోన వెంకట్ రిపీట్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. అత్యంత క్రేజ్ ఉన్న జంటగా పేరుపొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఆరేళ్ల తర్వాత రణబలి చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వస్తున్న ఈ పీరియడ్ బ్యాక్‌డ్రాప్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

