Vishwak Sen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్ ?.. ఆగస్ట్ 15న క్లారిటీ ఇవ్వనున్న హీరో..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్ స్టాలో ఓ నోట్ షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్ట్ 15న వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Vishwak Sen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్ ?.. ఆగస్ట్ 15న క్లారిటీ ఇవ్వనున్న హీరో..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2023 | 8:55 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు విశ్వక్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్ స్టాలో ఓ నోట్ షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్ట్ 15న వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ కు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారా ? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే విశ్వక్ పోస్ట్ పై మాత్రం ఆగస్ట్ 15న క్లారిటీ రానుంది.

“ఇన్నాళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు.. శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. త్వరలోనే నా జీవితంలో మరో ఘట్టాన్ని ప్రారంభించబోతున్నాను. నేను కుటుంబాన్ని స్టార్ట్ చేయబోతున్నాన. ఆగస్ట్ 15న పూర్తి వివరాలు వెల్లడిస్తాను” అంటూ ఆ నోట్ లో రాసుకొచ్చారు విశ్వక్. అయితే ఈ పోస్ట్ చూస్తుంటే మాత్రం పెళ్లి వార్తలాగే అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్ (మ్యారెజ్)..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇదిలా ఉంటే.. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విశ్వక్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తున్నారు.

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ అంజలి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ మరోసారి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

విశ్వక్ సేన్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.