Allu Arha: డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. అర్హ చేష్టలకు ఫిదా కావాల్సిందే.. మీరు ఓ లుక్కెయ్యండి..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియా చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయాన్, అర్హకు

Allu Arha: డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. అర్హ చేష్టలకు ఫిదా కావాల్సిందే.. మీరు ఓ లుక్కెయ్యండి..
Allu Arha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2021 | 6:41 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియా చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయాన్, అర్హకు సంబంధించిన ప్రతి చిన్న వీడియోను, అల్లరిని బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. ఇక కొన్నిసార్లు బన్నీ కూడా అర్హ, అయాన్‏లకు సంబంధించిన అల్లరి వీడియోలను సోషల్ మీడియాల షేర్ చేస్తుంటారు. అర్హకు ఇప్పటికే నెట్టింట్లో ఫాలోయింగ్ ఓ రేంజ్‏లో ఉంది. తన ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది అర్హ. అయితే అర్హ ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్‏గా కనువిందు చేయబోతుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అర్హ మేకప్ వీడియో, లోకేషన్ సెట్‏లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా హల్‏చల్ చేస్తుంది. అయితే ఈసారి అర్హ వీడియోను షేర్ చేసింది స్నేహరెడ్డి కాదండోయ్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. తన గారాల పట్టి కుందేలుతో ఆడుకుంటున్న వీడియోను బన్నీ తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేశారు.

స్టార్‌ కిడ్ అంటే గుర్తుకు వచ్చే వారిలో అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఒకరు. తన క్యూట్.. అండ్‌ స్వీట్ ఇన్‌స్టా వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ సంపాదించిన ఈ చిన్నారి… తాజాగా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ పై కనిపించేందుకు రెడీ అయిపోయింది కూడా…! తండ్రి తగ్గ తనయగా టాలీవుడ్‌లో తన సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసింది కూడా…! అయితే తాజగా అర్హ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఓ వైట్ రాబిట్‌‏తో ఆడుకుంటూ… బోసి నవ్వులు నవ్వుతూ అందర్నీ ఫిదా చేస్తోంది… ఈ అల్లు బేబీ…ఈ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Tuck Jagadish: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..

Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..

Shilpa Shetty: తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ట్వీట్.. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటోంది?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!