Pushpa 2 Movie: అమ్మవారి ఉగ్రరూపంలో అల్లు అర్జున్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
ఎస్ ! ఓ పక్క బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన మూడు నిమిషాల 14 సెకండ్ల వీడియో గ్లింప్స్ కంటే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా ఆ ఫోటోనే అందరికీ కిక్కిస్తోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే.. ఉగ్ర రూప దారి అయిన గంగమ్మ రూపంలోకి మారిన పుష్ప ఫోటో..! ఎస్ ! పట్టు చీర కట్టుకుని.. ముక్కు పుడక.. బుట్ట కమ్మలు.. చేతికి ఎర్ర రంగు గాజులు..

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప రాజ్ మయంగా మారిపోయింది. పుష్ప నేమ్ అండ్ సీన్స్ నెట్టింటిని రఫ్పాడిస్తున్నాయి. రఫ్ఫాడించడమే కాదు.. పుష్ప పాట్ టూ ది రూల్ పై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా కోసం అందర్నీ ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈరోజు విడుదలైన పుష్ప 2 టీజర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మాస్ అవతార్‌లో బన్నీ లుక్ చూసి అభిమానులు ఖుషి అయ్యారు. ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుష్ప రాజ్ ఫోటో మాత్రం అందర్నీ ఒక్క నిమిషం ఆగేలా చేస్తోంది. కళ్లర్పకుండా చూసేలా చేస్తుంది. ఎప్పుడూ చూడని బన్నీని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఎస్ ! ఓ పక్క బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన మూడు నిమిషాల 14 సెకండ్ల వీడియో గ్లింప్స్ కంటే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా ఆ ఫోటోనే అందరికీ కిక్కిస్తోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే.. ఉగ్ర రూప దారి అయిన గంగమ్మ రూపంలోకి మారిన పుష్ప ఫోటో..! ఎస్ ! పట్టు చీర కట్టుకుని.. ముక్కు పుడక.. బుట్ట కమ్మలు.. చేతికి ఎర్ర రంగు గాజులు.. మెడలో బంగారు గొలుసులు.. నిమ్మకాయల దండతో.. ఎర్ర కళ్లతో.. గంభీరంగా ఉండే కొలువై ఉండే గంగమ్మలా పుష్ప రాజ్ ఈ ఫోటోలో కనిపించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు.. చేతిలో గన్ను కూడా కనిపిస్తుండడంతో.. అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఈ ఫోటోను స్వయంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.




డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ వన్ తో మాస్ మ్యూజిక్‌తో హోరెత్తించిన దేవీ శ్రీ ప్రసాద్.. ఇక మరోసారి థియేటర్లలలో హుషారెత్తించే మాస్ సాంగ్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.