Pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. బాస్కెట్ బాల్ మ్యాచ్ మధ్యలో పీలింగ్స్ సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం గతేడాది డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజైన తర్వాత ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగాయి.

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలై దగ్గర దగ్గర మూడు నెలలైంది. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. పుష్ప 1కి మించి పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ పరంగాను పుష్ప 2 సినిమా రికార్డ్ సృష్టించింది. ‘బాహుబలి 2’ కలెక్షన్లను సైతం అధిగమించింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి పుష్ప 2 వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న పుష్ఫ 2 సినిమాకు ప్రత్యేక గౌరవం దక్కింది. అదేంటంటే.. ఇక నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ బయో చేంజ్ చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అంటే మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ను కూడా పుష్ప రాజ్ నే రూల్ చేస్తున్నాడన్నమాట.
‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 05న విడుదలైనప్పుడు లేని 25 నిమిషాల అదనపు సన్నివేశాలను ‘పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ లో చేర్చారు. అలాగే పుష్ప 2 సినిమాలోని సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. సినిమాలోని సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. పుష్ప 2 సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఎంతో మంది పుష్ప 2 సాంగ్స్ కు రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా గ్లోబల్ స్టేజీపై కూడా పుష్ప 2 సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్ లో హ్యూస్టర్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ టీమ్స్ మధ్య బాస్కెట్ బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ లో ఆడియన్స్ ను ఖుష్ చేయడానికి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేశారు. పుష్ప 2లోని పీలింగ్స్ సాంగ్ కు స్టెప్పులేశారు. 45 మంది డ్యాన్సర్స్.. పుష్ప 2చిత్రంలోని పీలింగ్స్ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు అల్లు అర్జున్ అభిమానులు సందడి చేస్తున్నారు.
A grand tribute to Icon Star @alluarjun & #Pushpa2 at the Houston Rockets vs Milwaukee Bucks game during the halftime show at @NBA!
A proud and historic moment, celebrating Indian cinema and culture on a global stage! 🌍🇮🇳#Pushpa2TheRule #AlluArjunpic.twitter.com/hEjhB9K2Pf
— Milagro Movies (@MilagroMovies) February 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
