మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.. 50ఏళ్ల వయసులోనూ భర్తను వెతుకుతుంది.. ఆ నటి పై కంగనా కామెంట్స్
డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్ గా ఎన్నో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే కాంట్రవర్సీల్లో కంగనా పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. ఇటీవలే ఎన్నికల్లో విజయం సంధించిన కంగనా ఎంపీ అయ్యింది. కంగనా బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె గెలుపొందింది. సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పనులకు కూడా ఫుల్ టైమ్ కేటాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నటనను వదిలేస్తుందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంగనా నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ పై కంగనా చాలా కామెంట్స్ చేసింది. అలాగే స్టార్ హీరోల పై కూడా ఆమె చాలా కామెంట్స్ చేసింది కంగనా..
ఇక ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నా కూడా కంగనా వివాదాలను వదలడం లేదు. తాజాగా ఆమె ఓ స్టార్ హీరోయిన్ గురించి, ఆ హీరోయిన్ పెళ్లి గురించి ప్రస్తావించింది. హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ పెళ్లిళ్లు గురించి కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విడాకుల గురించి మాట్లాడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ డమ్ ఉన్నవారిలో జెన్నిఫర్ లోపెజ్ ఒకరు.
జెన్నిఫర్ లోపెజ్‌కు ఎంతో పేరు , ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆమె వివాహ బంధాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్నీ కంగన ప్రస్తావించింది. ఎందరో మగాళ్లతో సంబంధాలు పెట్టుకుని పలుసార్లు పెళ్లిళ్లు చేసుకున్న లోపెజ్ ఇప్పుడు వయసు యాభై దాటాక కూడా తనకు సరిపోయే జీవిత భాగస్వామిని వెదుక్కుంటూనే ఉంది అని కంగనా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇతర దేశాలవారు భారతీయ వివాహాలను ఎగతాళి చేసినప్పుడల్లా ఇది గుర్తుంచుకోవాలి. భూమిపై అత్యంత హాటెస్ట్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్న బెన్ అఫ్లెక్. పిల్లలు పుట్టినా, పెళ్లిళ్లు చేసుకున్నా, ఇప్పటికీ సరైన భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. అలానే జెన్నిఫర్ లోపెజ్ కూడా ధనవంతురాలు, స్టార్ పాప్ సింగర్ అయినా కూడా ఆమె కూడా భర్తను వెతుకుంటుంది. ఇప్పటికీ ఇతరదేశాల వారు డేటింగ్ యాప్‌లపై ఆధారపడతారనీ, అయితే భారతీయ ఆచారాలు దీనికి విరుద్ధమని చెప్పింది. మన దేశంలో పెళ్లికి చాలా విలువ ఉంది. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారని కంగనా పొగడ్తలు కురిపించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
