ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 ఫీవర్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో పుష్పరాజ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీ గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. దీంతో పుష్ప 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. అలాగే మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈసారి పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే యాక్షన్ డ్రామాను చూసేందుకు జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీంతో ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్.
ఇటీవల బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం ఏకంగా రెండు లక్షల జనాల మధ్య బహిరంగ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో నార్త్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, ఈవెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు నార్త్ లో ప్రమోషన్స్ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు సౌత్ అడియన్స్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు దక్షిణాదిలో హావా చూపించేందుకు రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఇప్పటికే కేరళలో బన్నీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు చెన్నైలో ఈవెంట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ నవంబర్ 24న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయనున్నారు. దీంతో ఈ ఈవెంట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కిస్సిక్ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.