Pushpa 2: సత్తా చాటిన పుష్ప రాజ్.. భారీ ధరకు పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఎన్ని కొట్లో తెలుసా.?

'పుష్ప 2' సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈలోగా ఈ సినిమా సేల్ స్టార్ట్ కాగా ఈ సినిమా OTT రైట్స్ ని ‘పుష్ప 2’ సినిమా ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తానికి అమ్మేసిందని తెలుస్తోంది. గతంలో 'పుష్ప' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి అమ్మేశారు. కానీ ఇప్పుడు మరో ఓటీటీ తో డీల్ సెట్ చేసుకున్నారు మేకర్స్

Pushpa 2: సత్తా చాటిన పుష్ప రాజ్.. భారీ ధరకు పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఎన్ని కొట్లో తెలుసా.?
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2024 | 1:22 PM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా కోసం బన్నీ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలైన పుష్ప  సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కోవిడ్ తర్వాత విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఇలా పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండేళ్లు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావడంతో సినిమా ప్రమోషన్‌కు ముందే రైట్స్‌ అమ్మకాలు మొదలయ్యాయి.

‘పుష్ప 2’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈలోగా ఈ సినిమా సేల్ స్టార్ట్ కాగా ఈ సినిమా OTT రైట్స్ ని ‘పుష్ప 2’ సినిమా ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తానికి అమ్మేసిందని తెలుస్తోంది. గతంలో ‘పుష్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి అమ్మేశారు. కానీ ఇప్పుడు మరో ఓటీటీ తో డీల్ సెట్ చేసుకున్నారు మేకర్స్. ‘పుష్ప 2’ OTT విడుదల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. పుష్ప 2 అన్ని భాషల హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఇటీవల, పెద్ద సినిమాలు రెండు ఓటీటీలు అంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్ముతున్నాయి. కానీ ‘పుష్ప 2’ సినిమా మాత్రం అలా కాకుండా కేవలం నెట్‌ఫ్లిక్స్‌కి మాత్రమే అమ్ముడైంది.

అదే విధంగా ‘పుష్ప 2’ సినిమా OTT హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రూ. 270 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తం మరే సినిమాకు రాలేదని అంటున్నారు. ఇటీవల ఓటీటీకి వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా హక్కులకు కూడా ఇంత భారీ మొత్తం ఇవ్వలేదని తెలుస్తోంది. ‘పుష్ప’ చిత్రం 2021లో ఓటీటీకి దాదాపు రూ.50 కోట్లకు అమ్ముడుపోగా, ‘పుష్ప 2’ ఏకంగా రూ.270 కోట్లకు అమ్ముడుపోయింది.

ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ సినిమా విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు మేకర్స్. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా టైం తీసుకుంటుండడంతో డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్‌లో ఫస్ట్‌ హాఫ్‌ ఎడిట్‌ పూర్తవుతుందని ఇటీవలే నిర్మాత తెలిపారు. నవంబర్‌లో సెకండ్ హాఫ్ ఎడిట్ రెడీ అవుతుంది. నవంబర్ నెలలో కొంత ఫైన్ ట్యూనింగ్ చేసిన తర్వాత నెలాఖరులో సెన్సార్ సర్టిఫికేట్ రానుంది. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.