Pawan Kalyan BirthDay : పవన్ కళ్యాణ్ కార్ కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆయన మొత్తం ఆస్తి విలువ ఎంతంటే..

సోషల్ మీడియా వేదికగా అభిమానులు పవన్ కు విషెస్ తెలుపుతున్నారు. సినీ ప్రేముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ రేర్ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ పోస్ట్ ను కూడా పంచుకున్నారు.

Pawan Kalyan BirthDay : పవన్ కళ్యాణ్ కార్ కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆయన మొత్తం ఆస్తి విలువ ఎంతంటే..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2024 | 12:59 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఆయన ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అభిమానులు పవన్ కు విషెస్ తెలుపుతున్నారు. సినీ ప్రేముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ రేర్ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ పోస్ట్ ను కూడా పంచుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కు సోషల్ మీడియా వేదికగా  శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్‌లోని అత్యంత సంపన్న నటుల్లో పవన్ ఒకరు. రాజకీయాలకు అతీతంగా సినిమా పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నారు పవన్.

పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు పవన్. ఆయన పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తులు సుమారు రూ. 164 కోట్ల రూపాయలు. పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంటి ధర రూ. 16 కోట్లు. అలాగే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇంటి విలువ రూ.12 కోట్లు. బంజారాహిల్స్‌లోని ఒక ఫ్లాట్ ధర రూ.1.75 కోట్లు.

అలాగే పవన్ కళ్యాణ్ బ్యాంక్ బ్యాలెన్స్ 20 కోట్ల రూపాయలకు పైగా ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయనే స్వయంగా పచుకున్నారు. వివిధ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టారు పవన్. వీటితో పాటు పవన్ కళ్యాణ్ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన దగ్గర జాగ్వార్, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లు ఉన్నాయి. అలాగే 14 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈరో కార్లు ఉన్నాయి. 2019లో పవన్ కళ్యాణ్ ఆస్తులు కేవలం రూ. 52 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. పవన్ కళ్యాణ్ ప్రతి నెలా దాదాపు 1.5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాదికి 18 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.అలాగే ఒక్కో సినిమాకు 10-12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు పవన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.