Allu Arjun: క్షీర రాముడికి అల్లు అర్జున్ భారీ విరాళం.. పంచారామక్షేత్రంలో రథశాల ప్రారంభం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈమూవీలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈమూవీలో ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టాడు. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ బన్నీ సంచలనం సృష్టించాడు. పుష్ప సినిమాతో నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వంద కోట్ల వైపు దూసుకెళుతోంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు బన్నీ. సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటాడు. ఇదిలా ఉంటే.. సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడు బన్నీ.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామక్షేత్రం శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి దేవస్థానానికి అల్లు అర్జున్ గతంలో భారీ విరాళాన్ని ప్రకటించారు. 2019 సంవత్సరంలో స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయంలో రథ శాల గోశాల వాహనశాల ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిమిత్తం సుమారు 20 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ ఇచ్చిన విరాళంతో నిర్మించిన గోశాల రథశాల వాహన శాల లను ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్థానికంగా ఉన్న అల్లు వారి కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ మరియు పలువురు నాయకులు చిరంజీవి యువత మెగా ఫ్యామిలీ ఫాన్స్ పాల్గొన్నారు.
Also Read: Samantha: సమంతకు మరో క్రేజీ ఆఫర్.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాటల మాంత్రికుడు.?
Vijay Devarakonda: తన మద్దతు చిరుకే అంటోన్న విజయ్ దేవరకొండ.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్..