Sukumar: బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తాను.. సుకుమార్ కామెంట్స్ వైరల్..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా.. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ స్టైల్ మేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. నార్త్ నుంచి మొదలు సౌత్ వరకు పుష్ప రాజ్ ఒక అలజడిని సృష్టించాడు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో బన్నీని చూపించి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు సుక్కు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ రూపొందించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప సక్సెస్ సెలబ్రెషన్స్ జరుపుకుంటుంది చిత్రయూనిట్. ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు సుకుమార్.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. “బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను పుష్ప షూటింగ్ లో ఉండగా.. అక్షయ కుమార్ కాల్ చేసి.. తనతో ఓ సినిమా చేయలని కలవమన్నారు. అందువలన ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేయనున్నాడు సుకుమార్. ఈ రెండింటి తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా రానుంది. మొత్తానికి సుకుమార్, అక్షయ్ కుమార్ కాంబోలో సినిమా మాత్రం రాబోతుందని చెప్పేశాడు డైరెక్టర్.
Also Read: Samantha: సమంతకు మరో క్రేజీ ఆఫర్.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాటల మాంత్రికుడు.?
Vijay Devarakonda: తన మద్దతు చిరుకే అంటోన్న విజయ్ దేవరకొండ.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్..