Allu Arjun: అల్లు అర్జున్‏కు రెగ్యులర్ బెయిల్ మంజూరు..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‏కు ఉపశమనం లభించింది. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేలు, అలాగే రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 30వ తేదీన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

Allu Arjun: అల్లు అర్జున్‏కు రెగ్యులర్ బెయిల్ మంజూరు..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 03, 2025 | 5:25 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‏కు ఉపశమనం లభించింది. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేలు, అలాగే రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బన్నీ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. బన్నీకి బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించరని.. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ పీపీ వాదనలు వినిపించారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనకు, బన్నీకి ఎలాంటి సంబంధం లేదని వాదనలు వినిపించారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. BNS సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని.. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు ఏమాత్రం వర్తించదని అన్నారు. ఇక తాజాగా విచారణ అనంతరం అల్లు అర్జున్ కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.