AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: The Rule: పుష్ప2 పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు.. సినిమాలో అవే హైలైట్‌‌ కానున్నాయట..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప(Puhpa).. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు.

Pushpa: The Rule: పుష్ప2 పై రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు.. సినిమాలో అవే హైలైట్‌‌ కానున్నాయట..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Apr 07, 2022 | 10:50 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప(Puhpa).. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. మునుపెన్నడూ కనిపించను విధంగా ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు బన్నీ.. పుష్ప రాజ్ గా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు ఐకాన్ స్టార్. ఆ పాత్రలో బన్నీ కాకుండా మరో హీరోని ఉహించుకోలేని విధంగా తన నటనతో కట్టిపడేశారు అల్లు అర్జున్. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. మొదటి పార్ట్ కు ఊహించినదానికంటే భారీ విజయం దక్కడంతో ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప1తో సాలిడ్ సక్సెస్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు పుష్ప 2ను ఎలా తెరకెక్కిస్తారా..? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఫస్ట్ పార్ట్ కు మించి పార్ట్ 2లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ చివరిలో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజిల్.. పార్ట్ 2లో మాత్రం రెచ్చిపోతారట.. పుష్ప 1లో బన్నీకి ఫహద్ కు మధ్య యాక్షన్ సీన్స్ లేవు.. ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకోవడమే చూపించారు. ఇప్పుడు పుష్ప 2లో మాత్రం ఇద్దరి మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. అలాగే మొదటి పార్ట్ లో చూపించిన సునీల్ మంగళం శీను పాత్ర.. అలాగే అనసూయ పాత్రలకు కూడా పార్ట్ 2లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఊహించని ట్విస్ట్ లు.. హీరో విలన్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇవన్నీ పార్ట్ 2ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు సుకుమార్. ఇప్పటికే స్టోరీని కంప్లీట్ చేసిన సుక్కు.. లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారట. మొదటి పార్ట్ ను కరోనా కారణంగా ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారు. ఇప్పుడు కేరళ అడవుల్లో షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట సుకుమార్ అండ్ టీమ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’