Allu Aravind: టాలీవుడ్ కష్టాలు.. ప్రభుత్వ సాయంపై సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి ఎన్నో ట్విస్ట్‌లు, మరెన్నో టర్నింగ్‌లు. పోసాని కామెంట్లు, ఆ తర్వాత జనసైనికుల రియాక్షన్ మరింత హీట్ పెంచేస్తోంది.
Allu Aravind: రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి ఎన్నో ట్విస్ట్‌లు, మరెన్నో టర్నింగ్‌లు. పోసాని కామెంట్లు, ఆ తర్వాత జనసైనికుల రియాక్షన్ మరింత హీట్ పెంచేస్తోంది. విషయం కేసుల వరకూ వెళ్లింది. పవన్ ఫ్యాన్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు పోసాని. తనకు ఏం జరిగినా పవన్‌దే బాధ్యతన్నారు.. ఈ తతంగం అంతా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే పవన్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. సినిమా సమస్యలు పరిష్కరించాలని త్వరలోనే సినిమా పెద్దలు ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ కలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై సమయం దొరికినప్పుడల్లా సినీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇటీవలే లవ్ స్టోరీ సక్సెస్ మీట్ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు చేశాయని అన్నారు. నేను తెలంగాణ ఇంకా ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి అని అన్నారు.
తాజాగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్‌ను కోరారాయన. రాజు తలచుకుంటే వరాలకు కొదవా అన్నారు అల్లు అరవింద్. కరోనా నుంచి ప్రజలను గట్టెక్కించినట్టే.. టాలీవుడ్‌నూ ఆదుకోవాలని కోరారు.
మరిన్ని ఇక్కడ చదవండి :