Gangubai Kathiawadi: ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’…’ గంగూబాయి కతియావాడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన

Gangubai Kathiawadi: 'మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై'...' గంగూబాయి కతియావాడి' రిలీజ్ డేట్ వచ్చేసింది..
Gangubai Kathiawadi
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2021 | 9:15 PM

Gangubai Kathiawadi: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గంగూబాయి కతియావాడి”. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌, టీజ‌ర్ విడుద‌లై విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది.

గంగూబాయి.. అండర్‌వరల్డ్‌ సహాయంతో ముంబైలోని కామతిపూరలో పలు వేశ్యాగృహాలు నడిపేది. దీంతో ఆమెకు ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ అనే పేరు వచ్చింది. అసలు గంగూబాయి ఎలా ముంబైలో అడుగుపెట్టిందంటే..తెలిసి తెలియని వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి అతడిని గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయింది గంగూబాయి. ఆమె అయామకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఆమె ప్రియుడు, గంగూబాయిని ట్రాప్ చేసి కామతిపురలోని ఓ వేశ్యాగృహంలో అమ్మేశాడు. అనుకోకుండా ఆ వలలో చిక్కుకున్న గంగూబాయి. మెల్లగా ఆ వృత్తిపై పట్టు సాధించి, ముంబై అండర్‌వరల్డ్‌ సహాయంతో సొంతంగా తనే వేశ్యాగృహాలు నడుపుతూ ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా ఎదిగింది.

ఆ తర్వాత కామతిపురలో జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆమె చేసిన ప్రయత్నాల కారణంగా అక్కడి ప్రజల్లో గంగూబాయి పట్ల ఓ గౌరవం ఏర్పడింది. ఆమె విగ్రహాలు మరియు ఫోటోలు ఈ ప్రాంతంలోని ఇళ్లలో కనిపించేవి.. స్థానికులు ఆమె గౌరవార్థం స్థానికంగా ఒక విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఓ వేశ్య అందర్నీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా ప్రధానాంశంగా దర్శకుడు సంజయ్ బన్సాలి సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6, 2022న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే అవాక్ అవుతారు..!

Megastar Chiranjeevi : మేనల్లుడి హెల్త్ ఆప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. మీ ఆశీస్సులు కావాలంటూ ట్వీట్..

Uttej: ఉత్తేజ్ సతీమణి పద్మ సంస్మరణ సభ.. కన్నీరుమునీరైన ఉత్తేజ్ ఆయన కూతురు..