చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే అవాక్ అవుతారు..!
హీరోయిన్లు సినిమాలతోపాటు ఫోటో షూట్స్ తోను ఎక్కువ బిజీగా గడిపేస్తుంటారు. డిజైనర్ వేర్ డ్రస్సులు ధరించి రకరకాల ఫోజులతో ఫోటో షూట్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు.
హీరోయిన్లు సినిమాలతోపాటు ఫోటో షూట్స్‌తోనూ ఎక్కువ బిజీగా గడిపేస్తుంటారు. డిజైనర్ వేర్ డ్రస్సులు ధరించి రకరకాల ఫోజులతో ఫోటో షూట్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ ముద్దుగమ్మలు వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక్కడ ఓ అమ్మడు కూడా ఇలా డిఫరెంట్ స్టైల్ లో ఫోటోలు దిగి అందరిని ఆకర్షిస్తుంది. మాములుగా ఫోటో షూట్స్ అంటే అయితే హాట్ హాట్‌గా లేకుండా పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటారు హీరోయిన్స్ ఈ భామ మాత్రం చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? చార్లీ చాప్లిన్ లుక్‌లో ఉన్న ఈ చిన్నది ఎవరంటే..
టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్‌ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది. అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక నభా సినిమాల విషయాని కొస్తే ఇటీవలే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాబినేషన్‌లో రానున్న సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.
Nabhaమరిన్ని ఇక్కడ చదవండి :