Karthikeya 2: కార్తికేయ2ని 50 థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం.. ఇప్పుడు అది 700 థియేటర్స్ అయ్యింది: అల్లు అరవింద్
రీసెంట్ డేస్ లో సూపర్ హిట్ గా నిలిచినా సినిమాల్లో కార్తికేయ 2 ఒకటి. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

రీసెంట్ డేస్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో కార్తికేయ 2(Karthikeya 2)ఒకటి. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ ఈ సినిమా తెరకెక్కించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చింది “కార్తికేయ 2”. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ..
ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే సినిమాలో సత్తా లేకపోతె అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు అలాగే దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియా వైజ్ అందరి ప్రేక్షకులకు రిచ్ చేసిన కార్తికేయ 2 సినిమా హోల్ టీం కు కంగ్రాట్స్, ఆగష్టు మంత్ సినిమా ఇండస్ట్రీ కి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. నిఖిల్, చందు గార్లు నాతో సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు .మాకు ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతాము తప్ప మాకు సినీ ఇండస్ట్రీ లో మాకు ఎలాంటి విభేదాలు లేకుండా మేమంతా హెల్టీ అట్మాస్ఫియార్ లో ఉంటాము అని చెప్పుకొచ్చారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




