AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: ఇక పై ఆ తప్పు చేయనంటున్న అల్లరోడు… షాకింగ్ విషయం తెలిపిన నరేష్..

టాలీవుడ్‌లో అల్లరోడిగా గుర్తింపు పొంది తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో గిలిగింతలు పెట్టడంలో ముందుటాడు.. మన అల్లరోడు అల్లరి నరేష్‌! టాలీవుడ్‌ హీరోలందరూ.. యాక్షన్‌ డ్రామా సినిమాలు చేస్తుంటే.. మనోడు మాత్రం కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ.. తెలుగు నాట.. విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు.

Allari Naresh: ఇక పై ఆ తప్పు చేయనంటున్న అల్లరోడు... షాకింగ్ విషయం తెలిపిన నరేష్..
Naresh
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2021 | 9:13 PM

Share

Allari Naresh: టాలీవుడ్‌లో అల్లరోడిగా గుర్తింపు పొంది తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో గిలిగింతలు పెట్టడంలో ముందుటాడు.. మన అల్లరోడు అల్లరి నరేష్‌! టాలీవుడ్‌ హీరోలందరూ.. యాక్షన్‌ డ్రామా సినిమాలు చేస్తుంటే.. మనోడు మాత్రం కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ.. తెలుగు నాట.. విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు.చాలా గ్యాప్‌ తరువాత నరేష్ నాంది సినిమాతో మరో సారి తన నటనను మనకు చూపించాడు. సీరియస్‌ కథతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరెక్కిన ఈ సినిమాను విజయ్‌ కేనకమేడల డైరెక్టర్‌ చేశాడు. ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుని.. 5 సంవత్సరాలు జైల్లో మగ్గుతూ.. చేయని నేరానికి శిక్ష అనుభవించే కుర్రాడిగా అల్లరి నరేష్ నటించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

పోలీసుల దాష్టీకానికి.. పెద్ద మనుషుల పాపానికి బలై.. నిస్సహాయకుడైన ఆ కుర్రాడు.. ఎదురుతిరిగి పోరాతే… అన్యాయాన్ని ప్రశ్నించే గొంతైతే… తను నిర్థోశినని నిరూపించుకుంటే? అనే క్రమంలో ఈ కథ సాగుతూ.. ఆధ్యాంతం అందరినీ ఆకట్టుకూంటూ.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే  ఈ సినిమాపై ఇటీవల  ఓ వార్త తెగ హల్‌చల్ అవుతుంది. ఈ సినిమాకి మొదట హీరోగా అల్లరి నరేష్‌ను అనుకోలేదట, రచయిత అనుకున్న హీరో ఈ సినిమాను తిరస్కరించడంతో ఈ సినిమా నరేష్ చేతికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాకి అందుతున్న ఆదరణ చూస్తే కచ్చితంగా ఆ హీరో తన కెరీర్‌లో ఓ గొప్ప కథను వదులుకున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరో కాదండీ తెలుగు చిత్రసీమలో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు అందుకునే శర్వానంద్. అవును శర్వానందే.. ఈ సినిమాకు మొదటగా శర్వానంద్‌తో సంప్రదింపులు చేశారంట, కానీ శర్వా ఈ సినిమాపై ఆసక్తి చూపకపోవడంతో నాంది నరేష్ చెంతకు చేరిందంట. ఈ కథ విన్న నరేష్ వెంటనే ఓకే చెప్పేశారంట. ఈ సినిమా కోసం నరేష్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు నరేష్ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అభిమానులు నరేష్ నటనను కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇక పై తనవద్దకు వచ్చిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను వదులుకోకుడాని నరేష్ అనుకుంటున్నారట. గతంలో ఇలానే చాలా సినిమాలను నరేష్ వదులుకున్నారని తెలుస్తుంది. ఇప్పడు ఆ పొరపాటు చేయకుండా కథలో బలమున్న సినిమాలను చేయాలనీ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే 5 కథలను సైతం ఎంపిక చేసుకొని సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ante Sundaraniki Movie: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికి’ అంటూ రాబోతున్న నాని..

Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..

Rashmika Mandanna: జోరు పెంచిన మహేష్ హీరోయిన్ ఏకంగా నాలుగు భాషల్లో రాణించాలని చూస్తున్న రష్మిక..