MAA Elections 2021: క్లైమాక్స్‌కి చేరిన ‘మా’ ఫైట్.. మోనార్క్ vs మంచు ప్యానళ్లు ఢీ అంటే ఢీ.. 28 ఏళ్ల ‘మా‘ ప్రస్థానం సాగిందిలా..

MAA Elections 2021:  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫైట్ క్లైమాక్స్‌కు చేరింది. యుద్ధానికి మిగిలింది మరికొన్ని గంటలే.  వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు తలమునకలయ్యాయి.

MAA Elections 2021: క్లైమాక్స్‌కి చేరిన ‘మా’ ఫైట్.. మోనార్క్ vs మంచు ప్యానళ్లు ఢీ అంటే ఢీ.. 28 ఏళ్ల ‘మా‘ ప్రస్థానం సాగిందిలా..
Maa Elections 2021
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 09, 2021 | 3:10 PM

MAA Elections 2021:  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫైట్ క్లైమాక్స్‌కు చేరింది. యుద్ధానికి మిగిలింది మరికొన్ని గంటలే.  వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు తలమునకలయ్యాయి. తమకే ఓటు వేయాలంటూ మా సభ్యులకి విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్యానల్ మెంబర్స్ సభ్యుల్ని స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. తమకే ఓటేయాలని ఇరు ప్యానళ్ల సభ్యుల సభ్యులను కోరుతున్నారు. తమను ఎన్నుకుంటే మా సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇతర నగరాల్లో నివాసముంటున్న మా సభ్యులను ఓటింగ్‌కు ఇక్కడకు రప్పించేందుకు ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. సభ్యుల ఫ్లైట్ ఛార్జీలు చెల్లించేందుకు కూడా ప్యానళ్లు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ఓటు వేసేలా ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో మునుపెన్నడూ లేని స్థాయిలో ఓటింగ్ నమోదుకావచ్చని తెలుస్తోంది.

మా ప్రస్థానం సాగిందిలా..

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) 1993, అక్టోబరు 4వ తేదీన  ఏర్పాటయ్యింది. తొలి అధ్యక్షులు చిరంజీవి, జనరల్ సెక్రటరీ మురళీమోహన్ వ్యవహరించారు. చిరంజీవి, మురళీమోహన్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజుల ఆలోచనతో మా జీవం పోసుకుంది. మా అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పటి వరకు 9 మంది అధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు పనిచేశారు. మా ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 956కు చేరింది.  ప్రారంభంలో మా సభ్యత్వ రుసుం రూ.5 వేలుగా ఉండేది. ఆ తర్వాత ఆ తర్వాత రూ.10 వేలు..ఇప్పుడు రూ.1 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం రూ.75 వేలుగా ఉన్న సభ్యత్వ రుసుమును  రూ.75వేలకు తగ్గిస్తానని మంచు విష్ణు హామీ ఇస్తున్నారు.

మా అధ్యక్ష ఎన్నికలు అధ్యక్ష, జనరల్ సెక్రటరీలు

1993-1995 చిరంజీవి, మురళీమోహన్ 1995-1997 కృష్ణ, మురళీమోహన్ 1997-1999 కృష్ణ, మురళీ మోహన్ 1999-2000 మురళీమోహన్, ఏవీఎస్ 2000-2002 నాగార్జున, ఏవీఎస్ 2002-2004 మురళీ మోహన్, మల్లిఖార్జున 2004-2006 మోహన్ బాబు, శివాజీరాజా (ఆరు నెలల ముందే రాజీనామా) 2004-2006 మోహన్ బాబు, మల్లిఖార్జునరావు 2006-2008 నాగబాబు, మల్లిఖార్జున రావు 2008-2010 మురళీమోహన్, ఆహుతి ప్రసాద్ 2010-2012 మురళీమోహన్, ఆహుతి ప్రసాద్ 2013-2015 మురళీమోహన్, ఆలీ 2015-2017 రాజేంద్రప్రసాద్, శివాజీరాజా 2017-2019 శివాజీరాజా, నరేష్ 2019-2021 నరేష్, జీవితా రాజశేఖర్

(మురళీమోహన్ ఐదుసార్లు అత్యధికంగా అధ్యక్షులుగా పనిచేశారు)

మా ఎన్నికల విధానం మా కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. తమకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానల్‌లో ఉన్నా ఓటు వేయొచ్చు. పేరుకు మాత్రమే రెండు ప్యానళ్ల మధ్యే పోటీగా పరిగణిస్తారు. ఫలితాల తర్వాత రెండు ప్యానళ్లను ఒకటిగానే పరిగణిస్తారు. ఎక్కువ ఓట్లు సాధించే 26 మంది ఒకే ప్యానల్‌గా ఏర్పడి కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

Also Read..

Mukesh Ambani: జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ క్లబ్‌లో చేరిన భారత కుబేరుడు..100 బిలియన్ డాలర్లు దాటిన ముఖేష్ అంబానీ సంపద

Zodiac Signs: ఈ రాశుల వారు అద్భుతమైన వినయంతో ఉంటారు.. ఏ రాశుల వారంటే..