Bangarraju: థియేటర్స్ దగ్గర కొనసాగుతున్న బంగార్రాజు హవా.. తొమ్మిది రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..

కింగ్ నాగార్జున లేటెస్ట్ గా నటించిన సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Bangarraju: థియేటర్స్ దగ్గర కొనసాగుతున్న బంగార్రాజు హవా.. తొమ్మిది రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..
Follow us

|

Updated on: Jan 23, 2022 | 6:24 PM

Bangarraju: కింగ్ నాగార్జున లేటెస్ట్ గా నటించిన సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి క‌రోనా లాంటి ప‌రిస్థితుల్లో ఎప్పుడు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తారో తెలియని అనుమానాల నేప‌థ్యంలో ధైర్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బంగార్రాజు టీమ్‌. త‌మ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసేది లేద‌ని తేల్చి చెప్పి మ‌రీ ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున‌. సొగ్గాడే చిన్ని నాయ‌న చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగ‌చైత‌న్య, కృతిశెట్టి, నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం బంగార్రాజు థియేట‌ర్ల వ‌ద్ద హావ కొనసాగిస్తోంది. రోజులు గడుస్తున్నా ప్రేక్షకులు బంగార్రాజు కోసం క్యూ కడుతున్నారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా నేటికీ 9 రోజులు పూర్తి చేసుకుంది.

మొత్తంగా ఈ తొమ్మిది రోజుల్లో కలిపి 31.58 కోట్ల నెట్, 51.02 కోట్ల గ్రాస్ వసూలైంది. తొమ్మిదో రోజు ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే .. నైజాం: 11 లక్షలు, సీడెడ్‌: 13 లక్షలు, ఉత్తరాంధ్ర: 12 లక్షలు,ఈస్ట్ గోదావరి: 9 లక్షలు, వెస్ట్ గోదావరి: 5 లక్షలు, గుంటూరు: 6 లక్షలు, కృష్ణా: 4 లక్షలు, నెల్లూరు: 4 లక్షలు మొత్తంగా తొమ్మిదో రోజు బంగార్రాజుకు 64 లక్షల నెట్, కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Director Maruthi: ప్రభాస్‏తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..

Sudha: నన్ను ఒంటరిగా వదిలేశారు.. రేపు నా పరిస్థితే వాళ్లకు వస్తుంది.. నటి సుధ ఎమోషనల్ కామెంట్స్..

Lata Mangeshkar: ఆరోగ్యం మెరుగుపడినా.. ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్స్ ఏమంటున్నారంటే..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ