Krithi Shetty : అందం అభినయంతో ఆకట్టుకున్న కుర్రది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది ఈ అందాల భామ. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ కృతి శెట్టి. ఇప్పుడు ఈ బ్యూటీ లక్కీ బ్యూటీగా మారిపోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కృతి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో మోడ్రన్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ఆతర్వాత రీసెంట్ గా నాగార్జున , నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో నటించింది కృతి .. ఈ సినిమా కూడా మంది విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తుంది. అలాగే రామ్ తో వారియర్ అనే సినిమా చేస్తుంది కృతి శెట్టి.
ఇకపోతే రొటీన్ పాత్రల్లో కనిపించినా అందంతో కవ్వించడం కృతికి ప్లస్. అయినా మునుముందు రొటీనిటీతో ప్రాబ్లెమేనని విశ్లేషిస్తున్నారు కొందరు. ఇక వరుస సినిమాలతో జోరుమీదున్న కృతి శెట్టి ఇక పై రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటే మంచిదంటున్నారు విశ్లేషకులు. మరి ఇక పై అయినా ఈ అమ్మడు ఒకే తరహా పత్రాలు కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటుందేమో చూడాలి. తాజాగా కృతి శెట్టి క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా టాక్. మెగా డాటర్ సుష్మిత నిర్మించబోయే సినిమాలో బేబమ్మ హీరోయిన్గా ఎంపికైనట్లుగా సమాచారం. మెగా డాటర్ సుష్మిత సొంతంగా ప్రొడక్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తన బ్యానర్ పై ఇప్పటికే నిర్మించిన వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు సుష్మిత. ఇందుకు ముందుగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించాలనుకుందట. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకుంటున్నారట. చూడాలి మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనైనా కృతి తన టాలెంట్ ను బయటపెడుతుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Director Maruthi: ప్రభాస్తో మారుతి రాజా డీలాక్స్ సినిమా.. కాలానికి తెలుసంటున్న డైరెక్టర్..