Srikanth: కొత్త శ్రీకాంత్‌ను చూడ‌బోతున్నారు.. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ చిత్రంలో త‌న పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Srikanth: అఖండ సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు న‌టుడు శ్రీకాంత్‌. త‌న‌లోని విలనిజంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. నిజానికి శ్రీకాంత్ కెరీర్ తొలి నాళ్ల‌లో విల‌న్ పాత్ర‌లో న‌టించినా ఈ రేంజ్‌లో..

Srikanth: కొత్త శ్రీకాంత్‌ను చూడ‌బోతున్నారు.. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ చిత్రంలో త‌న పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Follow us

|

Updated on: Jan 23, 2022 | 5:42 PM

Srikanth: అఖండ సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు న‌టుడు శ్రీకాంత్‌. త‌న‌లోని విలనిజంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. నిజానికి శ్రీకాంత్ కెరీర్ తొలి నాళ్ల‌లో విల‌న్ పాత్ర‌లో న‌టించినా ఈ రేంజ్‌లో ఆక‌ట్టుకుంది మాత్రం అఖండ‌లోనే అని చెప్పాలి. వ‌ర‌ద‌రాజు పాత్ర‌లో అంద‌రినీ మెప్పించిన శ్రీకాంత్ తాజాగా రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

అఖండలో విల‌న్ ఆఫర్ ఎలా వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చెబుతూ.. ‘సరైనోడు సినిమాలో నటిస్తున్న సమయంలోనే బోయపాటి శ్రీను, విల‌న్ పాత్ర‌లో న‌టిస్తారా అని అడిగారు. అప్పుడే ఓకే చెప్పాను. కానీ అప్ప‌టి వ‌ర‌కు చిన్న సినిమాల్లో న‌టించొద్ద‌ని బోయ‌పాటి కండిష‌న్ పెట్టారు. యుద్ధం శ‌ర‌ణం సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించాను. ఇక బోయ‌పాటి అఖండ సినిమా క‌థ చెప్పి. వ‌ర‌ద‌రాజులు పాత్ర గురించి వివ‌రించారు. పాత్ర గురించి విన‌గానే కొత్త‌గా అనిపించింది. అనుకున్న‌ట్లే ఈ పాత్ర‌తో మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే అఖండ చిత్రం ఈ స్థాయిలో హిట్ అవుతుంద‌ని ఊహించ‌లేదు‘ అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్‌.

ఇక రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో త‌న పాత్ర గురించి తెల‌పిన శ్రీకాంత్‌.. ఈ చిత్రంలో త‌న పాత్ర‌ను చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ షాక్ అవుతార‌న్నారు. సినిమా చూసిన వారంతా ఇత‌ను శ్రీకాంతేనా అనుకుంటార‌ని, తెర‌పై కొత్త శ్రీకాంత్‌ను చూడ‌బోతున్నార‌ని త‌న పాత్ర ఎలా ఉంటుంద‌న్న దానిపై హింట్‌ ఇచ్చారు శ్రీకాంత్‌. మ‌రి ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్‌ను ఎలాంటి మ‌లుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌తో చేతి నిండా సంపాద‌న‌.. భార‌త్‌లో అందుబాటులోకి పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌..

Karimnagar: హెల్మెట్‌ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్‌.. అతగాడి ఓవరాక్షన్ చూడండి

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు..

Latest Articles
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..