BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు..
BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోయిడాలోని ఈ సంస్థలో ఇన్వెస్టిగేటర్లు, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోయిడాలోని ఈ సంస్థలో ఇన్వెస్టిగేటర్లు, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఇన్వెస్టిగేటర్లు (350), సూపర్‌వైజర్లు (150) ఖాళీలు ఉన్నాయి.
* ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే స్థానిక భాష తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
* సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును projecthr@becil.com మెయిల్ ఐడీకి పంపించాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇన్వెస్టిగేటర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 24,000, సూపర్ వైజర్ పోస్టులకు రూ. 30,000 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 25-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..
Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా