Naga Chaitanya: అవసరమైన చోట థాంక్యూ చెప్పము.. కానీ ఆ మాటకు అసలైన అర్థం తెలిసింది.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్..
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ థాంక్యూ మూవీపై మరింత ఇంట్రెస్ట్ పెంచాయి. రాశీఖన్నాతోపాటు.. మాళవికా నాయర్, అవికా గోర్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం థాంక్యూ (Thank You). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya Akkineni), రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాను డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ థాంక్యూ మూవీపై మరింత ఇంట్రెస్ట్ పెంచాయి. రాశీఖన్నాతోపాటు.. మాళవికా నాయర్, అవికా గోర్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే శనివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ.. మా తాతయ్య ఏయన్నార్, నాన్న నాగర్జునల స్పూర్తితోనే నేను నటుడియ్యాను. కానీ ఈరోజు సినిమాను మనస్పూర్తిగా ప్రేమించి చేస్తున్నానంటే అది కేవలం ప్రేక్షకుల వల్లే. నా బాధ్యతను గుర్తు చేసేది మీరే. మీ అందరికి మంచి సినిమాలు ఇవ్వాలన్నేది నా ధ్యేయం అని అన్నారు.
” మనం థాంక్యూ అనే మాటను జీవితంలో అనేక సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ అవసరమైన చోట మాత్రం వాడం. ఆ మాటకున్న అసలైన అర్థమేంటో నాకు ఈ సినిమా ద్వారా తెలిసిందే. ఈ మూవీ చూశాక ప్రేక్షకులూ స్పూర్తి పొందుతారని నమ్ముతున్నాను. ఈ కథను నావరకు తీసుకొచ్చినందుకు దిల్ రాజు గారికి థాంక్స్. విక్రమ్ అందించిన ఎన్నో చిత్రాల్లో థాంక్యూ గొప్ప సినిమా. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. ” అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.