Renu Desai: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో అకీరా చేసిన అద్భుతం.. రేణు దేశాయ్‌ను ఎంతో అందంగా మార్చాడో చూశారా ?..
ఏఐ సాయంతో సృష్టించిన చిత్రాలు, వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అనేక యాప్స్ ద్వారా తమ అభిమాన సెలబ్రెటీల ఫోటోలను తయారు చేసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు స్టార్ హీరోహీరోయిన్స్ ఏఐ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ఏఐ ఫోటోస్ షేర్ చేస్తూ తన కొడుకు అకీరా పై ప్రశంసలు కురిపించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగులకు భయాందోళనకు గురి చేస్తున్న పేరు. నిజానికి ఇది టెక్ వరల్డ్‌లోని హాటెస్ట్ బజ్ వర్డ్స్ లో ఒకటి. ఏఐ ఇప్పుడు కోట్లాది మంది ఉద్యోగాలకు చెక్ పెట్టేసి వాణిజ్య ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమవుతుంది. అయితే దీనిని బ్యాన్ చేయాలంటూ ఓవైపు హాలీవుడ్ మొత్తం ఆందోళనకు దిగింది. ఏఐ సాయంతో సృష్టించిన చిత్రాలు, వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అనేక యాప్స్ ద్వారా తమ అభిమాన సెలబ్రెటీల ఫోటోలను తయారు చేసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు స్టార్ హీరోహీరోయిన్స్ ఏఐ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ఏఐ ఫోటోస్ షేర్ చేస్తూ తన కొడుకు అకీరా పై ప్రశంసలు కురిపించారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి రేణు దేశాయ్ ఫోటోలను మాడిఫై చేశాడు అకీరా నందన్. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో రేణు దేశాయ్ చూడగానే ఆకట్టుకునే రూపంతో మరింత అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. వాటిలో రేణు దేశాయ్ ఎంతో అందంగా ఉందని.. ఫోటోస్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.




ఇదిలా ఉంటే… చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రేణు.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.